ఆదివారం, డిసెంబర్ 15, 2013

నీ ఎంకమ్మా ............... !!! ????

అసలు నీఎంకమ్మా   అనేపదం ఎప్పుడు ఎక్కడమొదలయ్యిందో ఖచ్చితంగా తెలియదుగాని ... కామెడి నటుడు బ్రహ్మానందం దీనికి ప్రమోటర్ గా సినిమాలలో వ్యవహరించి అందరికి దగ్గరచేసేసాడు. అసలు ఇది తిట్టా కాదా అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

హైస్కూలులో ఉన్నప్పుడు "ఒరై నీఎంకమ్మా ఇంత చిన్న లెక్క చెయ్యడానికి ఇంతసేపా..." అని కొత్తగా వచ్చిన కుర్రమాస్టారు అంటున్నప్పుడు ఈ పదంలో ఎదో తెలియని  గమ్మత్తు కనిపించింది.
                                                         
                                   



 ఆ మాట అంటున్నప్పుడు పక్క క్లాసులోంచివిన్న హెడ్మాష్టారు ఆయనని పక్కకి తీసుకుని వెళ్ళి పిల్లల ముందు అలాంటి పదాలు వాడినందుకు ఆయనకి క్లాసు పీకినప్పుడు అదేపదం కొంచెం భయపెట్టింది.




కాలేజీలో ఉన్నప్పుడు "అరెయ్ మామా నీఎంకమ్మా సైకిల్ టైర్ పంక్చెర్ అయితే ఒక ఫొన్ కొట్టచ్చుకదరా, నాబైక్  మీద డ్రాప్ చెసేవాడిని ... " అని కృష్ణ అంటున్నప్పుడు   ఇదే పదం  మాఇద్దరిమధ్య రిలేషన్ చాలా క్లొజ్ అనిపించేలా చేసింది.

ఈ పదానికి అర్ధం ఏమిటి అన్న విషయాన్ని పక్కనపెడితే  అవసరాన్ని అవకాశాన్ని బట్టి  ఎక్కడైనా ఎప్పుడైనా వాడేసే వెసులుబాటు ఈపదంలో ఉంది. అయితే పెద్ద వాళ్ళ ముందు మాత్రం కొంచెం అలొచించి  ప్రయోగించాలి
ఆమధ్య ఉత్సాహం ఎక్కువైపోయి అందరూఇంట్లో ఉన్నప్పుడు ఈపదం వాడి పెద్దవాళ్ళతో ముక్కదొబ్బులు తిన్నప్పుడు, మాట్లాడేటప్పుడు ఒళ్ళుదగ్గరపెట్టుకోవలసిన అవసరాన్ని గుర్తుచేసింది.




అన్నట్టు ఈపదం జండర్ ఇండిపెండెంట్.

" నీఎంకమ్మా టెన్-మినిట్స్ నుండి వెయిట్ చేస్తున్నాను , లంచ్ కి రావడానికి ఇంతసేపా... " కూట్ గా, ప్రొఫెషనల్ గా ఉండే నాకొలిగ్ చాలా కాజువల్ గా  నాతో అంటున్నప్పుడు అదే పదం ఎంతో ముద్దుముద్దుగా అనిపించిది.




కనుక పెద్దవాళ్ళకి తగుమాత్రం గౌరవం ఇచ్చేస్తూ వాళ్ళులేనప్పుడు ఈ పదం వాడుకుంటూ ఎంజాయ్ చెయ్యచన్నమాట. అది నాడిస్కవరి.....